You can edit almost every page by Creating an account. Otherwise, see the FAQ.

Jakkam

From EverybodyWiki Bios & Wiki

Script error: No such module "AfC submission catcheck".

Telugu jakkam (తెలుగు జక్కం) refers to the grammar of the Telugu language, which is a Dravidian language spoken predominantly in the Indian states of Andhra Pradesh and Telangana. Telugu grammar encompasses various aspects, including phonology, morphology, syntax, and semantics.

words[edit]

Telugu words are classified into different categories based on their origin and form. The main classifications are:

1. Tatsamulu (తత్సములు): These are words borrowed directly from Sanskrit without any modifications. They retain their original form and pronunciation. For example, "కర్మ" (karma), "విద్య" (vidya).

2. Tatbhavamu (తద్భవము): These are words derived from Sanskrit but have undergone phonetic changes to fit the Telugu sound system. For example, "దేవుడు" (devudu) from the Sanskrit "దేవ" (deva), "నడి" (naḍi) from "నది" (nadi).

3. Desyamulu (దేశ్యములు): These are native Telugu words that are not derived from Sanskrit. They originate from the Dravidian roots of the language. For example, "నెల" (nela) meaning month, "మట్టి" (matti) meaning soil.

4. Gramyamulu (గ్రామ్యములు): These words are considered colloquial or rustic, often used in rural areas and folk speech. They may include slang or dialectal variations.

sandhi[edit]

Sandhi is the fusion of sounds across word boundaries and the alteration of sounds due to neighboring sounds or due to the grammatical function of adjacent words.

Telugu sandhis can be divided into native ones and those derived from Sanskrit ones.

1. ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి యగు. పూర్వపరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధి యనఁబడు : రాముఁడు + అతఁడు = రాముఁడతఁడు : సోముఁడు + ఇతఁడు = సోముఁడితఁడు : మనము + ఉంటిమి = మనముంటిమి : అతఁడు + ఎక్కడ = అతఁడెక్కడ : ఇతఁడు + ఒకఁడు = ఇతఁడొకఁడు :

2. ప్రధమేతర విభక్తి శత్రర్థ చువర్ణంబు లందున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగును : నన్ను + అడిగె = నన్నడగె, నన్నునడిగె. నాకొఱకున్‌ + ఇచ్చె = నాకొఱకిచ్చె, నాకొఱకునిచ్చె. నాకున్‌ + ఆదరువు = నాకాదరువు, నాకునాదరువు. నాయందున్‌ + ఆశ = నాయందాశ, నాయందునాశ. ఇందున్‌ + ఉన్నాఁడు = ఇందున్నాఁడు, ఇందునున్నాఁడు. ఎందున్‌ + ఉంటివి = ఎందుంటివి, ఎందునుంటివి. వచ్చుచున్‌ + ఉండెను = వచ్చుచుండెను, వచ్చుచునుండెను. చూచుచున్‌ + ఏగును = చూచుచేగెను, చూచుచునేగెను.

3. సంధి లేని చోట స్వరంబుకంటెం బరంబయిన స్వరంబునకు యడాగమంబగు : ఆగమం బనఁగా వర్ణాధిక్యంబు. మా + అమ్మ = మాయమ్మ. మీ + ఇల్లు = మీయిల్లు. మా + ఊరు = మాయూరు.

4. అత్తునకు సంధి బహుళముగా నగు : మేన + అల్లుడు = మేనల్లుడు, మేనయల్లుడు. పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు, పుట్టినయిల్లు. చూడక + ఉండెను = చూడకుండెను, చూడకయుండెను. బహుళ గ్రహణముచేత స్త్రీవాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధిలేదు. అమ్మ + ఇచ్చెను = అమ్మయిచ్చెను. దూత + అతఁడు = దూతయితఁడు. చెలువుఁడ + ఇందము = చెలువుఁడయిందము. సంస్కృతీయంబునకు సంధి యగునని యధర్వణాచార్యులు చెప్పిరిగాని దానికిం బూర్వకావ్యంబులందుఁ బ్రయోగంబు మృగ్యంబు. ఆధునిక కృతులం దొకానొకచోట స్త్రీవాచక తత్సమంబులకు సంధి గానం బడియెడు. గంగనుకాసె, నెలఁతిచ్చెను. వెలయాల్వాదుల సంధిలేమి బాహుళకముచేతనే యని యూహించునది.

5. ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు : ఏమి, మఱి, కిషష్టి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి, ఇది యాకృతి గణంబు. ఏమి + అంటివి = ఏమంటివి, ఏమియంటివి. మఱి + ఏమి = మఱేమి, మఱియేమి. హరికిన్‌ + ఇచ్చె = హరికిచ్చె, హరికినిచ్చె. 6. క్రియాపదంబులం దిత్తునకు సంధి వైకల్పికముగా నగు. వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు, వచ్చిరియప్పుడు. వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు. 7. మధ్యమపురుష క్రియలయం దిత్తునకు సంధి యగును : ఏలితివి + అపుడు = ఏలితివపుడు. ఏలితి + ఇపుడు = ఏలితిపుడు. ఏలితిరి + ఇపుడు = ఏలితిరిపుడు.

8. క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు : వచ్చి + ఇచ్చెను = వచ్చియిచ్చెను.

9. ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు : ప్రథమేతర విభక్తివిధి నిరవకాశంబుగావున దీనిని బాధించెడిని. వచ్చున్‌ + ఇపుడు = వచ్చునిపుడు చూడన్‌ + అయితి = చూడనయితి. ఉండెడిన్‌ + అతఁడు = ఉండెడినతఁడు. ఇఁక, ఇఁగ, ఎట్టకేలకు, ఎట్టకేని, ఈయవి - యికాదులని యెఱుంగునది. వీనికి సంధి వైకల్పికము.

10. అచ్చున కామ్రేడితంబు పరంబగునపుడు సంధి తఱుచుగ నగు: ద్విరుక్తము యొక్క పరరూప మామ్రేడిత మనంబడు. తఱచుగ ననుటచేత నొకానొకచోట వైకల్పిక సంధియుం గలదని తాత్పర్యము. ఔర + ఔర = ఔరౌర. ఆహా + ఆహా = అహాహా. ఎట్టూ + ఎట్టూ = ఎట్టెట్టూ. ఓహో + ఓహో = ఓహోహో. ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి. ఎగి యేగి యనుచోఁ గ్త్వార్థంబగుట సంధిలేదు. 11. అంద్వవగాగమంబులం దప్ప నపదాదిస్వరంబు పరంబగునపు డచ్చునకు సంధి యగు. మూర + ఎఁడు = మూరెఁడు వీసె + ఎఁడు = వీసెఁడు అర్థ + ఇంచు = అర్థించు నిర్జి + ఇంచు = నిర్జించు అంద్వవగాగమంబులు పరంబగునపుడు యథాసంభవముగా గ్రహించునది. రాములందు - రాములయందు, హరియందు, ఎనిమిదవది - ఎనిమిదియవది. 12. కుఱు చిఱు కడు నడు నిడు శబ్దముల ఱ డ ల కచ్చు పరంబగునపుడు ద్విరుక్తటకారం బగు. కుఱు + ఉసురు = కుట్టుసురు చిఱు + ఎలుక = చిట్టెలుక కడు + ఎదురు = కట్టెదురు నడు + ఇల్లు = నట్టిల్లు నిడు + ఊరుపు = నిట్టూరుపు 13. ప్రథమమీఁది పరుషములకు గ స డ ద వ లు బహుళముగా నగు. వాఁడు + కొట్టె = వాఁడు గొట్టె, వాఁడు కొట్టె అపుడు + చనియె = అపుడు సనియె, అపుడు చనియె నీవు + టక్కరివి = నీవు డక్కరివి, నీవు టక్కరివి మీరు + తలఁడు = మీరు దలఁడు, మీరు తలఁడు వారు + పోరు = వారు వోరు, వారు పోరు అపు డిప్పు డెప్పు డను శబ్దములు నిత్యైక వచనాంతములు. వాగనుశాసనులు యదాతదా యని గ్రహించుట ప్రపంచార్థమని యెఱుఁగునది. ఈ కార్యము కళలగు క్రియా పదముల మీఁద సహితము కానంబడియెడి. రారు + కదా = రారు గదా, రారు కదా వత్తురు + పోదురు = వత్తురు వోదురు, వత్తురు పోరుదు 14. తెనుఁగుల మీఁది సాంస్కృతిక పరుషములకు గ స డ ద వ లు రావు. వాఁడు + కంసారి = వాఁడు కంసారి వీఁడు + చక్రపాణి = వీఁడు చక్రపాణి ఆయది + టంకృతి = ఆయది టంకృతి అది + తథ్యము = అది తథ్యము ఇది + పథ్యము = ఇది పథ్యము 15. ద్వంద్వంబునం బదంబు పయి పరుషములకు గ స డ ద వ లగు. కూర + కాయ = కూరగాయలు కాలు + చేయి = కాలుసేతులు టక్కు + టెక్కు = టక్కు డెక్కులు తల్లి + తండ్రి = తల్లిదండ్రులు ఊరు + పల్లె = ఊరువల్లెలు 16. ద్రుతప్రకృతికము మీఁది పరుషములకు సరళము లగు. పూచెను + కలువలు = పూచెను గలువలు తోఁచెను + చుక్కలు = తోఁచెను జుక్కలు చేసెను + టక్కులు = చేసెను డక్కులు నెగడెను + తమములు = నెగడెను దమములు మొగిడెను + పద్మము = మొగిడెను బద్మము 17. ఆదేశసరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాష నగు. సంశ్లేషం బనగా మీఁది హల్లుతోఁ గూడికొనుట. పూచెను గలువలు .... పూచెంగలువలు, పూచెఁగలువలు, పూచెన్గలువలు తోఁచెను జుక్కలు .... తోఁచెంజుక్కలు, తోఁచెఁజుక్కలు, తోఁచెన్జుక్కలు చేసెను డక్కులు .... చేసెండక్కులు, చేసెఁడక్కులు, చేసెన్డక్కులు నెగడెను దమములు ... నెగడెందమములు, నెగడెఁదమములు, నెగడెన్దమములు మొగిడెను బద్మము ... మొగిడెంబద్మము, మొగిడెఁబద్మము, మొగిడెన్బద్మము పక్షంబున స్వత్వంబగు. స్వత్వంబనఁగా ద్రుతంబునకుఁ బ్రకృతి భావము. 18. ద్రుతంబునకు సరళస్థిరంబులు పరంబు లగునపుడు లోపసంశ్లేషంబులు విభాష నగు. వచ్చెను + గోవులు = వచ్చె గోవులు, వచ్చెన్గోవులు, వచ్చెను గోవులు మెఱసెను + ఖడ్గము = మెఱసెఖడ్గము, మెఱసెన్ఖడ్గము, మెఱసెను ఖడ్గము 19. వర్గయుక్సరళములు పరములగునపు డొకానొకచో ద్రుతమునకుఁ బూర్ణబిందువును గానంబడియెడి. వచ్చెను + ధాత్రీపతి = వచ్చెంధాత్రీపతి పాడెను + గంధర్వుఁడు = పాడెంగంధర్వుఁడు కన్‌ + దోయి = కందోయి 20. అవసానంబునందు ద్రుతస్వరంబునకేని ద్రుతంబున కేని లోపంబు బహుళంబుగా నగు. వాఁడువచ్చెన్‌ - వాఁడువచ్చె - వాఁడువచ్చెను. ఈలోపంబు పద్యాంతములయందు గణానుసారంబుగ వ్యవస్థితంబయియుండు గుర్వవసాయియగు పద్యంబుతుదను స్వత్వంబులేదు. అతిశయముగ బుద్ధిమంతుఁడగు బుధసేవన్‌. 21. కొన్నియెడల ద్రుతంబుమీఁద నకారంబు గానంబడియెడి. అదియునున్గాక, దివంబునుంబోలె. 22. అఁట యిఁక చుఁడు శబ్దంబులం దప్ప నుడి తొలి హ్రస్వంబుమీఁద ఖండబిందువును ద్రుతంబునకు లోపంబును లేవు. ముంగొంగు, క్రొంబసిఁడి, కన్దోయి. 23. తాను నేను పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు. తాను + ౘదివె = తాఁ ౙదివె, తాను ౙదివె తాను + వినె = తా వినె, తాను వినె దీర్ఘంబు మీఁదిది గాన దీనికి నెఱసున్న లేదు. 24. సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు. ఎల్లయర్థములు, ఎల్లకలుషములు. సర్వపర్యాయంబయిన యెల్ల శబ్దంబు ద్రుతాంతంబయిన యవ్యయంబు. దీని కసమాసంబున విశేష్యంబునకు ముందు ప్రయోగంబు లేదు. 25. సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుం, బుంపులకుం బరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు. ఇచటం బరుషంబులు పరంబులగునపుడు ద్రుతంబునకు బిందు సంశ్లేషంబులచే మూఁడురూపంబులు. సరళంబులు పరంబులగునపుడు లోప సంశ్లేష పూర్ణబిందువులచేత మూఁడు రూపములు. విధాన సామర్థ్యము వలన దీనికి లోపము లేదు. వక్ష్యమాణవిధిచే స్వత్వములేదు. చిగురు + కయిదువు = చిగురుంగయిదువు, చిగురుఁగయిదువు, చిగురున్గయిదువు తళుకు + గజ్జెలు = తళుకుంగజ్జెలు, తళుకుగజ్జెలు, తళుకున్గజ్జెలు సింగపు + కొదమ = సింగపుంగొదమ, సింగపుఁగొదమ, సింగపున్గొదమ ఉన్నతంపు + గొడుగు = ఉన్నతంపుంగొడుగు, ఉన్నతంపుగొడుగు, ఉన్నతంపున్గొడుగు నలుఁగడాదులు నీ యాగమంబు లేదండ్రు. ఈ యాగమంబొకా నొకచోట స్థిరంబు పరంబగుచోఁ గానంబడియెడి. గఱునపున్మురువు. 26. సమాసంబులందు ద్రుతంబునకు స్వత్వంబు లేదు. 27. తలఁబ్రాలు మొదలగు సమాసంబుల ద్రుతమునకు లోపము లేదు. తలఁబ్రాలు, ఒడిఁబ్రాలు, సేసఁబ్రాలు, ఊరఁబంది, ఊరఁబిచ్చిక, తోడఁబుట్టువు, తోఁబుట్టువు, ఒల్లన్‌బాటు, ఒడఁబాటు ఇత్యాదులు. 28. కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమం బగు. కఱకు + అమ్ము = కఱకుటమ్ము నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము సరసపు + అలుక = సరసపుటలుక 29. కర్మధారయంబునందుఁ బేర్వాదిశబ్దముల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాషనగు. పేరు + ఉరము = పేరటురము, పేరురము చిగురు + ఆకు = చిగురుటాకు, చిగురాకు పొదరు + ఇల్లు = పొదరుటిల్లు, పొదరిల్లు 30. పేదాది శబ్దంబుల కాలుశబ్దము పరంబగునపుడు కర్మధారయంబునందు రుగాగమం బగు. పేద + ఆలు = పేదరాలు బీద + ఆలు = బీదరాలు పేద, బీద, ముద్ద, బాలింత, కొమ్మ, జవ, అయిదవ, మనుమ, గొడ్డు ఇట్టివి పేదాదులు. ఇందు జవ్వని శబ్దంబునకు జవాదేశంబని యెఱుంగునది. "ఏకాంతమునందు నున్న జవరాండ్ర" నని ప్రయోగము. 31. కర్మధారయంబునం దత్సమంబుల కాలుశబ్దము పరంబగునపు డత్వంబున కుత్వంబును రుగాగమంబు నగు. ధీర + ఆలు = ధీరురాలు గుణవంత + ఆలు = గుణవంతురాలు ఇచట వృత్తియం దాలుశబ్దము స్త్రీమాత్రపరము. 32. కర్మధారయంబులందు మువర్ణకంబునకుం బుంపు లగు. సరసము + మాట = సరసపుమాట, సరసంపుమాట విరసము + వచనము = విరసపువచనము, విరసంపువచనము 33. ఉదంతమగు తద్ధర్మార్థవిశేషణమున కచ్చు పరమగు నపుడు నుగాగమం బగు. చేయు + అతఁడు = చేయునతఁడు చేసెడు + అతఁడు = చేసెడునతఁడు 34. షష్ఠీసమాసమునం దుకార ఋకారముల కచ్చు పరమగునపుడు నుగాగమం బగు. విధాతృయొక్క + ఆనతి = విధాతృనానతి రాజుయొక్క + ఆజ్ఞ = రాజునాజ్ఞ 35. ఉదంత స్త్రీసమంబులకును, బుంపులగు నదంతగుణవాచకంబులకును దనంబు పరంబగునపుడు నుగాగమంబగు. సొగసు + తనము = సొగసుందనము, సొగసుఁదనము, సొగసున్దనము సరసపు + తనము = సరసపుందనము, సరసపుఁదనము, సరసపున్దనము తెల్ల + తనము = తెల్లందనము, తెల్లఁదనము, తెల్లన్దనము 36. సమాసంబునఁ బ్రాఁతాదుల తొలియచ్చుమీఁది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగా నగు. ప్రాఁత + ఇల్లు = ప్రాయిల్లు, ప్రాఁతయిల్లు లేఁత + దూడ = లేదూడ, లేఁతదూడ పూవు + రెమ్మ = పూరెమ్మ, పూవురెమ్మ 37. లుప్త శేషంబుకుం బరుషములు పరములగునపుడు నుగాగమం బగు. ప్రాఁత + కెంపు = ప్రాఁగెంపు లేఁత + కొమ్మ = లేఁగొమ్మ పూపు + తోఁట = పూఁదోఁట మీఁదు + కడ = మీఁగడ కెంపు + తామర = కెందామర చెన్ను + తోవ = చెందోవ చెన్ను శబ్దము వృత్తిని శోణార్థకంబు. బహుళ గ్రహణముచే మీఁదు ప్రభృతులం నిట లోపంబు నిత్యంబు. వ్యవస్థిత విభాషచే నీ ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు. 38. క్రొత్తశబ్దమున కాద్యక్షరశేషంబునకుం గొన్ని యెడల నుగాగమంబునుం గొన్ని యెడల మీఁదిహల్లునకు ద్విత్వంబు నగు. క్రొత్త + చాయ = క్రొంజాయ క్రొత్త + చెమట = క్రొంజెమట క్రొత్త + పసిఁడి = క్రొంబసిఁడి క్రొత్త + కారు = క్రొక్కారు క్రొత్త + తావి = క్రొత్తావి పరుషేతరంబులు పరంబులగునపుడు నుగాగము ప్రాప్తి లేమిఁ జేసి వానికి ద్విత్వంబగు. క్రొత్త + గండి = క్రొగ్గండి క్రొత్త + నన = క్రొన్నన క్రొత్త + మావి = క్రొమ్మావి కెంధూళి కెంజడలని ప్రయోగంబులు కానంబడియెడి. బహుళ గ్రహణముచేతఁ గ్రొత్తకుండ లిత్యాదుల లోపంబులేదు. క్రీఁగడుపు, క్రీఁగాలు, క్రీఁదొడ ఇత్యాదులం గ్రిందుశబ్దమునకు లుప్తశేషంబునకు దీర్ఘంబు బహుళ గ్రహణముచేత నని యెఱుఁగునది. 39. అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచోఁ గానంబడియెడి. ఒకానొక శబ్దంబున నొకానొక శబ్దము పరంబగునపుడు తొంటియటు లోపనుగాగమంబును, గొండొక శబ్దమున కొకానొక శబ్దము పరంబగునపుడు లోపద్విత్వంబులును ప్రయోగంబులందుఁ జూపట్టెడునని తాత్పర్యము. పది + తొమ్మిది = పందొమ్మిది తొమ్మిది + పది = తొంబది వంక + చెఱఁగు = వంజెఱఁగు సగము + కోరు = సంగోరు నిండు + వెఱ = నివ్వెఱ నిండు + వెఱఁగు = నివ్వెఱఁగు నెఱ + తఱి = నెత్తఱి నెఱ + నడుము = నెన్నడుము నెఱ + మది = నెమ్మది నెఱ + వడి = నెవ్వడి ఇత్యాదులు ప్రయోగంబుల వలనం దెలియునది. 40. ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదులం దొలి యచ్చు మీఁది వర్ణంబుకెల్ల నదంతం బగు ద్విరుక్త టకారం బగు. ఈ సూత్రమునకు భృశార్థంబునందు ద్విరుక్తంబు విషయంబని యెఱుంగునది. కడ + కడ = కట్టకడ ఎదురు + ఎదురు = ఎట్టఎదురు కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుమ, పగలు, పిడుగు, బయలు, మొదలు ఇత్యాదులు కడాదులు. 41. ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తిలోపంబు బహుళంబుగా నగు. అప్పటికిన్‌ + అప్పటికిన్‌ = అప్పటప్పటికిన్‌, అప్పటికప్పటికిన్‌ అక్కడన్‌ + అక్కడన్‌ = అక్కడక్కడన్‌, అక్కడనక్కడన్‌ ఇంటన్‌ + ఇంటన్‌ = ఇంటింటన్‌, ఇంటనింటన్‌ ఊరన్‌ + ఊరన్‌ = ఊరూరన్‌, ఊరనూరన్‌ ఇంచుక నాఁ డిత్యాదులందు బహుళగ్రహణముచేత నంతిమాక్షర లోపంబు నగు. ఇంచుక + ఇంచుక = ఇంచించుక. ఇంచుకించుక నాఁడు + నాఁడు = నానాఁడు, నాఁడునాఁడు 42. అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు. అందదుకు, ఇఱ్ఱింకులు, ఇల్లిగ్గులు, చెల్లచెదరు, చెల్లాచెదరు, తుత్తుమురు, తుత్తునియలు, మిఱుమిట్లు ఇత్యాదులెఱుంగునది. 43. చేత తోడ వలనల కిత్వంబు సమాసంబులం దగు. నీచేతన్‌ + ప్రోపు = నీచేతిప్రోపు నాతోడన్‌ + చెలిమి = నాతోడిచెలిమి నీవలనన్‌ + భయము = నీవలనిభయము 44. అంద్వాదుల కలిగాగమంబు సమాసంబునం దగు. నాయందున్‌ + కరుణ = నాయందలి కరుణ ఇందున్‌ + జనులు = ఇందలిజనులు ఎందున్‌ + వారు = ఎందలివారు ఎందు శబ్దమున కలిగాగమము కొందఱు లేదండ్రు. 45. అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగ నగు. నా + అది = నాది, నాయది నా + అవి = నావి, నాయవి ఉదంతములగు తద్ధర్మ విశేషణంబులకు మీఁద లోపంబు లేదనియు నిదంతంబులగు తద్ధర్మ విశేషంబులకు మీఁద నిత్యంబనియు బహుళగ్రహణముచే నెఱుంగునది. వచ్చునది - వచ్చునని, వచ్చెడిది - వచ్చెడివి. 46. పడ్వాదులు పరంబులగునపుడు మువర్ణకంబునకు లోపపూర్ణబిందువులు విభాష నగు. భయము + పడె = భయపడె, భయంపడె, భయముపడెను సూత్రము + పట్టె = సూత్రపట్టె, సూత్రంపట్టె, సూత్రముపట్టె ఈ కార్యము కర్తృవాచి మువర్ణకమునకుఁ గలగదు. గజము పడియె, అశ్వము పడియె. 47. మధ్యమపురుష మువర్ణకంబునకు హలవసానంబులు పరంబులగునపుడు లోపము విభాష నగు. చూడుము + నన్ను = చూడునన్ను, చూడుము నన్ను ఇటు + చూడుము = ఇటుచూడు, ఇటు చూడుము చూడుమనియె, వినుమనియె. ఇచ్చట నచ్చు పరంబయినది. కాబట్టి లోపములేదు. 48. వ్యతిరేక మధ్యమ మువర్ణకంబున కెల్లయెడల లోపంబు విభాష నగు. నమ్మకము + ఇట = నమ్మకిట, నమ్మకు మిట 49. ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ ముడుఙ్ఙు లోపంబు విభాష నగు. ఉండుము + ఉండుము = ఉండుండుము,ఉండుముండుము కొట్టుఁడు + కొట్టుఁడు = కొట్టు కొట్టుఁడు, కొట్టుఁడు కొట్టుఁడు 50. విసర్గంబున కనుకరణంబున లోపం బగు. వర్ధతాం శ్రీః + అనియె = వర్ధయాం శ్రీ యనియె. 51. అనుకృతిని నమశ్శబ్దము తుది యత్తున కోత్వము విభాష నగు. తుభ్యంనమః + అనె = తుభ్యంనమో అనె, తుభ్యం నమ యనె ఈ కార్యము లాఁతిచో సహితము గనంబడియెడి. గతాను గతికో లోకో యటంచున్‌. 52. అనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచనం బగు. కింతత్‌ + అనియె = కింతత్తనియె కస్త్వమ్‌ + అనియె = కస్త్వమ్మనియె 53. అనుకరణంబునం దహమాదుల మకారంబునకు ద్విరుక్తి విభాషనగు. దాసోహమ్‌ + అనె = దాసోహమ్మనె, దాసోహమనె తత్కర్తవ్యమ్‌ + అనె = తత్కర్తవ్యమ్మనె, తత్కర్తవ్యమనె 54. ఉదంతనామంబున కనుకరణంబునందు వుగాగమం బగు. ఇయంధేనుః + అనె = ఇయంధేనువనె అనుకృతిని నిడుదకుం గుఱుచ యగునని యొకండు పలికెనది నిరాకరంబు. దుర్బలస్య బలం రాజా యన వినవే. 55. వాక్యావసానంబున సంధిలేమి దోషంబు కాదని యార్యు లండ్రు. సత్యము సర్వశ్రేయము - అదిలేనిచో సర్వధర్మములు వ్యర్థములు. ఇట్లు సంధి విరహంబు కావ్యంబులం బాదాంతమంద చూపట్టెడు.

samasam[edit]

1. సమర్థంబులగు పదంబు లేకపదం బగుట సమాసంబు. ప్రథగ్భూతంబులగు నర్థంబుల కేకార్థీభావంబు సమర్థ్యంబు. పృథక్ప్రసిద్ధార్థంబులగు పదంబుల కేకార్థంబునందు వృత్తి సామర్థ్యము. 2. సాంస్కృతికాచ్ఛిక మిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు. సాంస్కృతికంబని యాచ్ఛికంబని మిశ్రంబని సమాసంబు త్రివిధంబు. అందు సాంస్కృతికంబు సిద్ధంబని సాధ్యంబని ద్వివిధంబు.

కేవల సంస్కృత శబ్దంబుల సమాసంబు సిద్ధంబు నాఁబడు. రాజాజ్ఞ - తటాకోదకము - లక్ష్మీవల్లభుఁడు.

సంస్కృత సమంబుల సమాసంబు సాధ్యంబు నాఁబడు. రాజునాజ్ఞ - తటాకంబు నుదకము - లక్ష్మీవల్లభుఁడు.

తక్కిన తెనుఁగుల సమాసం బాచ్ఛికం బనంబడు. ఱేని యానతి - చెఱువు నీరు - సిరి చెలువుఁడు.

ఉభయంబు గూడినది మిశ్రమంబనంబడు. రాజు ముదల - చెరువునుదకము - సిరివల్లభుఁడు. 3. తత్పురుషాదులకు లక్షణంబు ప్రాయికంబుగ సంస్కృతోక్తంబ యగు. తత్పురుష బాహువ్రీహి ద్వంద్వంబునని సమాసంబులెల్లం ద్రివిధంబులయి యుండు. అవి ప్రాయికంబుగా నుత్తరాన్యోభయపదార్థ ప్రధానంబు లయియుండు. అందుఁ దత్పురుషంబు వ్యధికరణంబని సమానాధికరణంబని ద్వివిధంబు.

ద్వితీయాదులకు మీఁది పదఁబుతోడ సమాసంబు వ్యధికరణంబు నాఁబడు. నెలతాల్పు - నెల తక్కువవాఁడు - దేవరమేలు - దొంగభయము - రాముని బాణము - మాటనేర్పరి.

విశేషణంబునకు విశేష్యంబుతోడ సమాసంబు సమానాధికరణంబు నాఁబడు. ఇదియె కర్మధారయంబు నాఁబడు. సరసపు వచనము - తెల్ల గుఱ్ఱము - మంచిరాజు.

ఇది సంఖ్యాపూర్వంబు ద్విగువునాఁబడు. ముజ్జగములు - ముల్లోకములు.

బాహువ్రీహి ముక్కంటి - చలివెలుఁగు.

ద్వంద్వము తల్లిదండ్రులు - అన్నదమ్ములు.

ప్రాయికంబుగా ననుటచే సంస్కృత లక్షణంబుఁ దొడరని సమాసంబుం గలదని సూచింపంబడియె. దానంజేసి చిగురుఁగేలు - జుంటిమోవి ఇత్యాదులయిన యుపమాన పూర్వపద కర్మధారయంబులు గ్రాహ్యంబులు.

ముఖపద్మము - చరణకమలములు. ఇట్టి యుపమానోత్తర పదంబులు గలవుగాని విపరీతంబులు సిద్ధంబులు లేవని యెఱుంగునది.

సిద్ధంబు సర్వంబు గ్రాహ్యంబు. రాజపురుషుఁడు - నీలోత్పలము - పీతాంబరుఁడు - రామలక్ష్మణులు.

కేవల సంస్కృత శబ్దము వికృతి శబ్దముతోడ సమసింపదు. దానంజేసి యనేకమాఱు లల్పదండిత్యాదులు దుష్టములని తెలియునది. 4. ఆ ఈ ఏ యను సర్వనామంబులు త్రికంబు నాఁబడు. 5. కర్మధారయంబు త్రిక స్త్రీ సమముగంత ధాతుజ విశేషణపూర్వపదం బయి యుండు. ఆ చందము - ఈ చందము - ఏ బృందము - వాఁడిమాట - పోఁడిపాట - బెడిదపుటడిదము - మడిసెడుదడములు.

ఈ నియమముచేఁ బల్లిదుఁడు మల్లుఁడు - కావాలుఁడు వారణుఁడు ఇత్యాదుల సమాసంబు లేదు. 6. స్త్రీ సమఘటితంబ యొకానొకండు బహువ్రీహి చూపట్టెడు. ముక్కంటి - వేగంటి - చలివెలుఁగు - వేవెలుఁగు - మోటబరి ఇత్యాదులు వ్యవహార సిద్ధంబులు గ్రాహ్యంబులు. 7. ఆచ్ఛికశబ్దంబుతోడ స్త్రీ సమంబు ప్రాయికంబుగా ద్వంద్వం బగు. అన్నదమ్ములు - తల్లిదండ్రులు - ఊరుపల్లెలు - ఆలుమగలు. మగఁడును బిడ్డలును - పల్లమును గళ్ళెమును ఇత్యాదులు సమసింపవని యీ నియమంబున నెఱుంగునది. 8. సర్వశబ్దంబులు సంబంధమునందుం దచ్ఛబ్దంబుతోడ సమసించు. నావాఁడు - నాయది - ఇంటివాఁడు - ఇంటిది - రామునివాఁడు - రామునిది. 9. ధాతుజ విశేషణంబులకు విభక్తి వివక్షించునపుడు తచ్ఛబ్దం బనుప్రయుక్తంబగు. వచ్చినవాఁడు - వచ్చినది - రానివాఁడు - రానియది. 10. ఎల్ల యెడల ధాతుజ విశేషణంబుల కట్టి యను పదంబు విభాష ననుప్రయుక్తం బగు. వచ్చినట్టి రాముఁడు - వచ్చిన రాముఁడు - వచ్చునట్టి వాఁడు - వచ్చువాఁడు. 11. యుష్మదస్మదాత్మార్థకంబుల కుత్తరపదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాష నగు. నీదు కరుణ - నీ కరుణ, నాదు నేరిమి - నా నేరిమి, తనదు రూపు - తనరూపు. 12. గుణవచనంబు లగు నల్లాదులకుం గర్మధారయంబునందు నిగాగంబు బహుళంబుగా నగు. నల్లని గుఱ్ఱము - నల్ల గుఱ్ఱము.

నల్ల - తెల్ల - పచ్చ - యెఱ్ఱ - చామ - తియ్య - కమ్మ - పుల్ల - విన్న - తిన్న - అల్ల ఇత్యాదులు నల్లాదులు. 13. ద్విరుక్తం బగు హల్లు పరంబగునపు డాచ్ఛికం బగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. 14. త్రికంబుమీఁది యసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు. అక్కన్య - ఆ కన్య, ఇక్కాలము - ఈ కాలము, ఎల్లోకము - ఏ లోకము, అయ్యశ్వము - ఆ యశ్వము.

బహుళకముచే నూష్మరేఫంబు లగు ద్విత్వంబు గలుగదు. ఆ రూపము - ఏ శబ్దము - ఏ షండము - ఆ సుకృతి - ఆ హయము. 15. కృత హ్రస్వంబగు త్రికంబు మీఁది చోటు శబ్దంబు నోత్వంబున కత్వ హ్రస్వంబులు విభాషనగు. అచ్చోటు - అచ్చటు - అచ్చొటు, ఇచ్చోటు - ఇచ్చటు - ఇచ్చొటు, ఎచ్చోటు - ఎచ్చటు - ఎచ్చొటు.

వీని ద్విత్వంబునకు వక్ష్యమాణవిధిచేఁ బాక్షికంబుగ లోపంబగు. అచటు - అచొటు - ఇచటు - ఇచొటు - ఎచటు - ఎచొటు - ముచ్చొటులు - ముచ్చటులు - ముచ్చొటులు అను రూపంబగు ప్రయోగంబులం గానంబడియెడి. 16. ఉత్తరపదం బగు చోట శబ్దముటాక్షరమునకు లోపంబు విభాష నగు. చోటు శబ్దం బౌపవిభక్తికంబు గావున దాని యంతిమాక్షరంబు సప్తమ్యాదేశమయిన యకారంబుతోడం బాక్షికంబుగ లోపించునని యర్థము. అచ్చోనున్నాఁడు - అచ్చోట నున్నాఁడు, ఒకచో నుండె - ఒకచోట నుండె. 17. సమానాధికరణంబగు నుత్తరపదంబు పరంబగునపుడు మూఁడు శబ్దము డుఙ్వర్ణంబునకు లోపంబును మీఁది హల్లునకు ద్విత్వంబునగు. మూఁడు జగములు - ముజ్జగములు, మూఁడు లోకములు - ముల్లోకములు. 18. ద్విగువున కేకవచనంబు ప్రాయికంబుగా నగు, మిశ్రంబునకుఁ గాదు. ముచ్చిచ్చు - ముక్కారు - ముప్పాతిక - ముత్త్రోవ - మువ్విధములు. 19. కొండొకచో సమాసంబులందు నామ్వాది కనుమ్వాదుల మువర్ణంబులు పఙ్పవర్ణంబు లగు. నాఁపచేను - పాఁపఁఱేడు.

కనుపపులు - జనుపనార - నాము - పాము - ప్రేము - వేము - అమ్ము - ఎమ్ము - ఇవి నామ్వాదులు. కనుము - ఇనుము - ఉడుము - ఎనుము - జనుము - మినుము ఇత్యాదులు కనుమాదులు. 20. నిక్కలాదులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు. నిక్కల - కవ్వడి - పువ్విలుకాఁడు ఇత్యాదులు. 21. ఆకారంబున కామ్రేడితంబునకుం దదర్థకంబున కయి యాయి యను శబ్దంబులు విభాష నగు. వక్ష్యమాణ విధిచేత నయి యనుదాని కైకాదేశంబునగు. ఆయయికాలము - ఆయాయికాలము - అయ్యయికాలము - అయ్యాయికాలము - అయైకాలము - అయ్యెకాలము - ఆయాకాలము - ఆయక్కాలము - అయ్యాక్కాలము - అయ్యక్కాలము. 22. బహువ్రీహిని సమాసాంత కార్యంబులుం గానంబడి యెడి. ముక్కంటి - కడలిరాచూలి - నలువ - గట్టువిలుతుఁడు. 23. బహువ్రీహిని స్త్రీవాచ్యం బగుచో నుపమానంబు మీఁది మేనునకుఁ బోఁడి యగు. అలరుబోఁడి - ననబోఁడి - పూబోఁడి - విరిఁబోఁడి. 24. ద్వంద్వంబునందు ఋకారంబునకు ర వర్ణంబు విభాషనగు. మాత్రుపితలు - మాతాపితలు ఇత్యాదులు. 25. సమాస విభక్తికి లోపంబగు లట్టునకుం గాదు. రాముని బాణములు - సరసపు వచనములు - వేవెలుఁగు - గుణములప్రోక. 26. కర్మాదులకుఁ బ్రాధాన్య వివక్షయందు ధాతుజవిశేషణంబులు కర్తతోడంబోలె వానితోడ సమసించు. రాముఁడు రక్షించిన భృత్యుఁడు - రాముఁడు వాలినేసిన బాణము - రాముఁడు గోవునిచ్చిన విప్రుఁడు - రాముఁడు వెడలిన వనంబు - రాముఁడు వసించిన పర్ణగృహము - రాముఁడు వసించిన చోటు.

vyutpatti[edit]

padālu[edit]

vibhakti[edit]

References[edit]


This article "Jakkam" is from Wikipedia. The list of its authors can be seen in its historical and/or the page Edithistory:Jakkam. Articles copied from Draft Namespace on Wikipedia could be seen on the Draft Namespace of Wikipedia and not main one.